తెలంగాణ‌లో కొత్తగా 147 కరోనా కేసులు

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,737
  • కోలుకున్న వారు 2,89,325 మంది
  • మృతుల సంఖ్య 1593
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 147 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 399 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,737కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,89,325 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1593కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,819 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,295 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి.

Corona Virus
COVID19
Telangana

More Telugu News